ETV Bharat / state

nizamabad collectorate: ప్రారంభోత్సవానికి సిద్ధమైన నూతన కలెక్టరేట్ భవనం - ప్రారంభోత్సవానికి సిద్ధమైన కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ భవనం

అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర ఉండేలా నిర్మించిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈనెల 13 లేదా 14న సీఎం కేసీఆర్ ఈ భవనాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

nizamabad new collectorate building ready for inauguration
ప్రారంభోత్సవానికి సిద్ధమైన నిజామాబాద్ నూతన కలెక్టరేట్ భవనం
author img

By

Published : Jun 9, 2021, 5:07 PM IST

నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో నిర్మించారు. కొత్త జిల్లాలతో పాటు ఇందూరు​కు కూడా నూతన కలెక్టరేట్​ను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈనెల 13 లేదా 14న సీఎం కేసీఆర్ ఈ భవనాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల సమీకృత కలెక్టరేట్​లు ఒకే సారి ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని హంగులతో ఈ కలెక్టరేట్లను నిర్మించారు. నిజామాబాద్ కలెక్టరేట్ పక్కనే శాశ్వత హెలిప్యాడ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. త్వరలోనే ప్రజలకు కలెక్టరేట్​లు అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చదవండి: Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.