తెలంగాణలో ప్రజలు చనిపోతున్నా తెరాస ప్రభుత్వానికి పట్టడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కొవిడ్‌తో ప్రజలు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదన్నారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దుర్భరంగా ఉన్నా ప్రజలకు వైద్యం అందడం లేదని ఆరోపించారు. సరైన వైద్యం అందించడంలో విఫలమవుతోన్న.. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మాత్రం కేసీఆర్ అమలు చేయరని అర్వింద్ విమర్శించారు. తెలంగాణలో రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంటే.. ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉచిత ఎరువులు, మందులు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. రెండేళ్లవుతోన్నా మాట నిలబెట్టుకోలేదన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్