దుబ్బాక ఉపఎన్నికను రైతుల విజయంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభివర్ణించారు. ఈ ఫలితంతోనైనా తెరాస కళ్లు తెరవాలని అన్నారు. రాష్ట్రంలో రైతులంతా పంటను తగలబెడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టిన స్పర్శ కూడ లేదని విమర్శించారు. దేశసేవలో ప్రాణాలర్పించిన వీరజవాన్ మహేశ్‌కు నివాళి అర్పించారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని వెల్లడించారు.
జిల్లాలో పోలీసులు అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సామాన్య ప్రజలపై తెరాస నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యావనంది మమత హత్యకేసులో నెలలు గడుస్తున్నా దర్యాప్తు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ సచివాలయానికి రావాలని ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో రైతులంతా భాజపాకే ఓటేశారని ఎంపీ అర్వింద్ తెలిపారు.