నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగర మేయర్ పర్యటించారు. నిజామాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీరు అందించే ఖిల్లా ఫిల్టర్, అలీ సాగర్ ఫిల్టర్ బెడ్లను సందర్శించి పరిశీలించారు. అధికారులు, ఇంజినీర్ల సాయంతో నీటిని శుద్ధి చేసే విధానాన్ని తెలుసుకున్నారు.
వేసవి పూర్తయ్యే వరకు ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. నగరంలో నీటి సరఫరా, నీటి లభ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!