ETV Bharat / state

ప్రజల సహకారంతోనే సత్ఫలితాలు సాధ్యం: మేయర్ నీతూకిరణ్ - sanition in nizamabad

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా... ప్రజల సహకారం అవసరమని నిజామాబాద్​ నగర మేయర్​ నీతూ కిరణ్​ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని 6 మున్సిపల్​ జోన్లకు ఫాగింగ్​ మెషీన్లు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

nizamabad mayor neethu kiran distributed fogging Machines
'ప్రభుత్వం ఎంత చేసినా... ప్రజల సహకారం అవసరం'
author img

By

Published : Jun 24, 2020, 8:28 PM IST

నిజామాబాద్​ నగరపాలక సంస్థలో దోమల బెడద తగ్గించటానికి మున్సిపల్​ జోన్లకు ఫాగింగ్ మెషీన్లను నగర మేయర్ నీతూ కిరణ్​ పంపిణీ చేశారు. నగరంలో 6 మున్సిపల్ జోన్లుండగా... జోనుకు 2 చొప్పున మొత్తం 12 మెషీన్లు అందజేశారు. నిల్వ ఉన్న నీళ్లలో దోమలు ఎక్కువగా వృద్ధిచెందే అవకాశం ఉన్నందున... ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు మేయర్​ సూచించారు.

ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల సహకారం అవసరమని.... ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేశ్​ వి పాటిల్, డీఎంహెచ్​ఓ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

nizamabad mayor neethu kiran distributed fogging Machines
'ప్రభుత్వం ఎంత చేసినా... ప్రజల సహకారం అవసరం'

ఇవీ చదవండి: పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.