నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఆరో డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్లో ఆర్అండ్బీ రూ.10లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రోజూ ఎదో ఒక డివిజన్లో పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు.
ప్రత్యేక పూజలు
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మేయర్ తెలిపారు. 300వ క్వార్టర్స్ వద్ద ఏక పాలరాతి శిల్ప కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నపూర్ణ మాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమారాణి, శ్రీనివాస్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో లొల్లి.. సర్దిచేప్పేందుకు వెళ్లిన వ్యక్తి హత్య