నిజామాబాద్ నగరంలోని డంపింగ్ యార్డును నగర మేయర్ దండు నీతూకిరణ్ పరిశీలించారు. డంపింగ్ యార్డు చుట్టూ కొనసాగుతున్న ప్రహరి గోడ నిర్మాణాన్ని, ధర్మకాంట, చెత్త సేకరణ పనులను కూడా పరిశీలించారు.
త్వరితగతిన పనులను పూర్తి చేయాలని.. చెత్తను తరలించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని మేయర్ నీతూ కిరణ్ తెలిపారు.
ఇవీ చూడండి: కడసారి వీడ్కోలు చెప్పే వీలు లేకుండా చేసిన కరోనా