ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

author img

By

Published : Oct 9, 2020, 5:08 PM IST

Updated : Oct 9, 2020, 6:13 PM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ సాగింది. మున్సిపల్‌ కౌన్సిలర్లు, నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ సభ్యులు ఓటు వేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రశాంతంగా ముగిసిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
ప్రశాంతంగా ముగిసిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

కొవిడ్ కారణంగా రెండు సార్లు వాయిదా పడిన పోలింగ్‌ ఎట్టకేలకు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలో 28, కామారెడ్డి జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.64 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 824 ఓట్లకు గాను... 821 ఓట్లు పోలయ్యాయి. కొవిడ్ నిబంధనల నడుమ బ్యాలెట్ పద్ధతిన జరిగిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా.. తెరాస నుంచి సీఎం కేసీఆర్​ కుమార్తె కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, భాజపా తరఫున పోతంకర్ లక్ష్మీ నారాయణ బరిలో నిలిచారు.

ఓటేసిన ప్రజాప్రతినిధులు

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్లు వేశారు. ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, భీంగల్, బాన్సువాడ మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు, నిజామాబాద్ నగర పాలక సంస్థలో కార్పొరేటర్లు తమ ఓటు వేశారు. తెరాస, భాజపాకు చెందిన ఓటర్లు కొద్దిరోజుల కింద క్యాంపులకు వెళ్లగా.. నేరుగా వచ్చి వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. నిజామాబాద్‌ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, వీజీ గౌడ్, రాజేశ్వర్ లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి భీంగల్​లో, బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే సురేందర్, బోధన్​లో ఎమ్మెల్యే షకీల్ తమ ఓటు వేశారు. తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత.. హైదరాబాద్ నుంచి వచ్చి నేరుగా కామారెడ్డిలో ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోని బూత్​లో పోలింగ్ సరళిని పరిశీలించారు.

అక్కడక్కడా అభ్యంతరాలు

నిజామాబాద్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రంలో భాజపా ఎంపీ అర్వింద్, నగర పాలక సంస్థ కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం సమీపంలో తెరాస కార్యకర్తలు, ఓటర్లు ఉండటంపై భాజపా నేతలు నిరసన తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్లు, నేతలు, కార్యకర్తలు ఉండటంపై అభ్యంతరం తెలిపారు.

పీపీఈ కిట్లతో వచ్చి..

నిజామాబాద్​ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కొవిడ్​ సోకిన వారు పీపీఈ కిట్లు ధరించి మరీ ఓటేశారు. ఓటు వేసే 24 మందికి కొద్ది రోజుల క్రితం వైరస్​ సోకింది. ఈ రోజు వారికి పరీక్ష నిర్వహించగా 8 మందికి నెగిటివ్​ వచ్చింది. మిగతా 16 మందికి పాజిటివ్​ ఉంది. వారిలో ఇద్దరు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు వేశారు. మిగిలిన వారు పీపీఈ కిట్​ ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈనెల 12న కౌంటింగ్​

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తి కాగా.. ఈనెల 12న నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: నామినేషన్​కు భారీ భద్రతా చర్యలు: సీపీ జోయల్​

Last Updated : Oct 9, 2020, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.