KTR To Inaugurate Nizamabad IT Hub : రాష్ట్రంలో ఐటీ(IT) రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వ్యాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా నేడు నిజామాబాద్‌లో నిర్మించిన ఐటీ టవర్(IT Towers)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించారు. వీటితో పాటు ఐటీ హబ్‌లోని వివిధ కంపెనీలను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. వాటికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సురేశ్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ విద్యార్థులతో ముచ్చటించి.. వారికి ల్యాప్‌టాప్‌ను అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐటీ హబ్‌లను బలోపేతం చేస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రానికి మరిన్ని కొత్త కంపెనీలను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు ఉపాధి, శిక్షణ సంస్థ- న్యాక్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించి.. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ ఇన్నోవేషన్ హబ్, వివిధ కంపెనీలను సైతం ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో మినీ ట్యాంక్‌బండ్‌గా రఘునాథ చెరువును ప్రారంభించారు. 3 వైకుంఠ ధామాలు, సమీకృత మార్కెట్, నిజామాబాద్ మున్సిపల్ నూతన భవనం, వర్ని రోడ్డులో ఉన్న నూతన వైకుంఠ ధామం ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు.
Siddipet IT Hub : అద్భుతంగా సిద్దిపేట ఐటీ హబ్.. ఫొటోలు చూశారా..?
Nizamabad IT Tower : ఇప్పటికే దేశానికి ఐటీ నగరంగా బెంగళూరును మించి హైదరాబాద్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. భాగ్యనగరంతో పాటు ఐటీ అన్ని జిల్లాల్లో విస్తరించాలనే ఉద్దేశంతో కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇప్పటికే ప్రారంభించిన ఈ ఐటీ టవర్లలో పలు అంతర్జాతీయ కంపెనీలు తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. నిజామాబాద్‌లో ప్రారంభించిన ఐటీ టవర్‌లో టీ-హబ్(T-HUB), టాస్క్ సెంటర్లు సైతం ఉన్నాయి.
Hyderabad as Robo Hub : రోబో హబ్‌గా హైదరాబాద్.. టీ హబ్ తరహాలో 'ట్రిక్స్'
Nizamabad IT Hub : ఈ నిజామాబాద్ ఐటీ టవర్స్(Nizamabad IT Tower)లో 750 మంది పని చేయవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రతి నెల ఒక జాబ్ మేళా ఉండేలా చర్యలు తీసుకున్నామని.. అమెజాన్, గూగుల్, ఐబీఎం, టెక్ మహీంద్రా వంటి సుమారు 52 అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను నిర్వర్తించనున్నాయని తెలిపారు.
Robotics Service in Hyderabad : రోబోటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్