నిజామాబాద్ ఎన్టీఆర్ కూడలి వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. యువతీ యువకులు వివిధ పాటలకు స్టెప్పులేస్తూ అలరించారు. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌పై అవగాహన పెంచుకోవాలని తమ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. సామాజిక రుగ్మతలు, ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకు ఫ్లాష్ మాబ్ నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ ఇందిర తెలిపారు.
- ఇదీ చూడండి : 'నిద్ర రావడం లేదా.. నా సినిమాలు చూడండి'