కేసీఆర్ హామీకివెనక్కి తగ్గని రైతన్నలు...
రైతులు రెండు రోజులుగా నామినేషన్ కాగితాలనుతీసుకెళ్తుండగా... మరికొన్నింటిని నేడు కూడా తీసుకెళ్లారు. అందరూ కలిసి మూకుమ్మడిగా శుక్రవారం రోజు భారీ ఎత్తున నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ బహిరంగ సభలో ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా రైతన్నలు వెనక్కి తగ్గట్లేదు.
కొనసాగుతున్న పసుపు రైతుల నామినేషన్ల పర్వం - NOMINATIONS
మద్దతు ధర కల్పించాలంటూ పసుపు, ఎర్రజొన్న రైతులు వెయ్యి నామినేషన్ల యజ్ఞం కొనసాగిస్తున్నారు. నిన్న ఐదుగురు.. ఇవాళ మరో ఇద్దరు నామపత్రాలు సమర్పించారు. శుక్రవారం భారీగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.
రైతుల నామినేషన్ల పర్వం
నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎర్రజొన్న, పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ ప్రాంత రైతులు నామినేషన్ల పర్వానికి సిద్ధం కాగా... ఇవాళ మోర్తాడుకు చెందినకొందరు కర్షకులు నామపత్రాలు సమర్పించారు. సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేస్తున్నామని అన్నదాతలు చెబుతున్నారు.
కేసీఆర్ హామీకివెనక్కి తగ్గని రైతన్నలు...
రైతులు రెండు రోజులుగా నామినేషన్ కాగితాలనుతీసుకెళ్తుండగా... మరికొన్నింటిని నేడు కూడా తీసుకెళ్లారు. అందరూ కలిసి మూకుమ్మడిగా శుక్రవారం రోజు భారీ ఎత్తున నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ బహిరంగ సభలో ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా రైతన్నలు వెనక్కి తగ్గట్లేదు.
sample description