ETV Bharat / state

బ్యాలెట్​ పోరు.. గడువులోగా పోలింగ్​ జరిగేనా!

author img

By

Published : Mar 29, 2019, 5:28 AM IST

Updated : Mar 29, 2019, 8:25 AM IST

నిజామాబాద్​ పార్లమెంట్​ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల బరిలో 185 మంది అభ్యర్థులు ఉండటం వల్ల బ్యాలెట్​ పద్ధతిలో పోలింగ్​ నిర్వహించనున్నారు. గడువులోగా పోలింగ్​ జరుగుతుందా లేదా అనే సందేహం అధికారుల్ని వెంటాడుతోంది.

నిజామాబాద్​లో బ్యాలెట్​ పోరు
నిజామాబాద్​లో బ్యాలెట్​ పోరు
నిజామాబాద్​ లోక్​సభ నియోజకవర్గ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బరిలో 185 మంది అభ్యర్థులున్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్​ ఇతర పార్టీల నేతలు కాక 178 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రైతులు పోటీకి దిగారు. సుమారు 23 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఓ సమస్యపై పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 1996 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుంచి 480 మంది పోటీ చేశారు.

బ్యాలెట్​ బాక్సులూ సరిపోవు..?

ఇక్కడ వినియోగించేందుకు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వాడిన బ్యాలెట్​ బాక్స్​లను అధికారులు పరిశీలించగా అవి చిన్నగా ఉన్నాయి. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దృష్ట్యా అవి సరిపోవని నిర్ణయించారు. 1996లో 480 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు వినియోగించిన బాక్స్​ల గురించి ఆరా తీసినప్పటికీ స్పష్టమైన సమాచారం రాలేదని ఓ అధికారి తెలిపారు.

అది మరో సమస్య...

నిజామాబాద్​ నియోజకవర్గంలో 15,52,838 మంది ఓటర్లున్నారు. పోలింగ్​కు దాదాపు 17 లక్షల వరకు బ్యాలెట్​ పత్రాలను ముద్రించాలి. 185 మంది అభ్యర్థుల పేర్లు, ఫోటోలను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవటం మరో సమస్య.

అప్పుడు ఎన్నిక వాయిదా వేశారు...

రెండేళ్ల కిందట మండలి ఎన్నికల్లో ఫోటో తారుమారు కావటం వల్ల ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది. డిసెంబర్​లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలో ఈవీఎంలలో అభ్యర్థి పేరు, ఫోటో ముద్రణలో కూడా పొరపాటు దొర్లినట్లు సమాచారం. సమయం ఉండటం వల్ల అధికారులు త్వరితంగా సర్దుబాటు చేశారని తెలిసింది.

వాయిదా పడుతుందా..?

నిజామాబాద్ నియోజకవర్గంలో 1788 పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయి. వాటిని పెంచాల్సిన అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇవన్నీ గడువులోగా కొలిక్కి వస్తాయా లేదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. సాధ్యం కాని పక్షంలో ఎన్నిక వాయిదా పడొచ్చని తెలుస్తోంది.

ఇవీ చూడండి:నిజామాబాద్​లో బ్యాలెట్​ పోరే: రజత్​ కుమార్​

Last Updated : Mar 29, 2019, 8:25 AM IST

For All Latest Updates

TAGGED:

nizamabad
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.