అల్లోపతి వైద్య విధానంలో శస్త్రచికిత్స చేసేలా ఆయుర్వేద వైద్యులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా వైద్యులు నిరసన తెలిపారు. ఈ మేరకు భారత వైద్యుల సంఘం(ఐఎంఏ)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఆయుర్వేద వైద్యులకు అల్లోపతిలో కనీస పరిజ్ఞానం లేదని ఐఎంఏ జిల్లా కార్యదర్శి డా. విశాల్ పేర్కొన్నారు. అనుభవం, అవగాహన లేకపోయినా శస్త్రచికిత్సలు చేయడానికి వారికి అనుమతి ఇవ్వడం అన్యాయమని.. ఇది ప్రజల ప్రాణాలను తీయడమేనని విమర్శించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రజల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి: మంత్రి శ్రీనివాస్ గౌడ్