ETV Bharat / state

ఈ ఊరికి మహాత్మా గాంధీ దేవుడయ్యాడు

ఈ ఊరికి మహాత్మాగాంధీ దేవుడు. ఉదయాన్నే లేచి పూజలు చేస్తారు. ఏ శుభకార్యమైనా గాంధీజీ ప్రార్థనతోనే ప్రారంభిస్తారు. వర్షం పడకపోయినా, కష్టం వచ్చినా జాతిపితనే స్మరిస్తారు. మహాత్ముడికి గ్రామస్థులు ఇంతగా పూజలు చేయడం వెనుక కారణం ఏంటి. గాంధీని గాడ్​గా ఎందుకు పూజిస్తున్నారు.

ఆ గ్రామానికి.. గాంధీ దేవుడయ్యాడు ఎందుకంటే?
author img

By

Published : Aug 20, 2019, 3:36 PM IST

ఈ గ్రామ ప్రజలకు మహాత్మాగాంధీ అంటే దైవంతో సమానం. ఊరి మధ్యలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేసి ఆరాధిస్తుంటారు. జయంతి, వర్ధంతితో పాటు పండుగుల సమయంలో నివాళులర్పించి పూజిస్తారు. ఏ శుభకార్యం జరిగినా... మహాత్ముని విగ్రహానికి పూలమాలలతో పూజలు చేస్తారు. అది ఎక్కడో కాదు.. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో.

ఈ గ్రామానికి.. గాంధీ దేవుడయ్యాడు ఎందుకంటే?

పూజలు, అభిషేకాలు

దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీని దైవంగా భావిస్తామని గ్రామస్థులు అంటున్నారు. ఊరిలో శుభకార్యలు, వివాహాలకు, సంతానం కలిగిన గాంధీ విగ్రహానికి అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి పూజిస్తారు. వర్షాల కోసం గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే... నర్సింగపూర్​లో మాత్రం వర్షాల కోసం గాంధీకి జలాభిషేకం చేస్తారు.

1961 నుంచే ఇదే ఆచారం:

డిచ్​పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ జనాభా 1274. గ్రామం చిన్నదైనా.. గాంధీని గౌరవించే విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. 1961 నవంబర్​ 1న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.