నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. అక్టోబర్ 12న ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొుదలవుతుందని జిల్లా పాలనాధికారి తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 7గంటలకు హాజరు కావాలన్నారు. అనంతరం కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న కారణంగా కౌంటింగ్‌కు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ,తదితరులంతా మహిళా కళాశాలకు ఎదురుగా ఉన్న గేట్ ద్వారా రావాలన్నారు. మెయిన్ గేట్ ద్వారా విద్యార్థులను, కళాశాల సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవి, ఏవో సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'దసరాలోగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి'