ప్రతి ఏడాది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో నిర్వహించే పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. కరోనా తీవ్రత దృష్ట్యా.. బోధన్ రూరల్ పోలీసులు ఈ విషయమై గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. భేటీలో ఈ సంవత్సరం పోటీలను నిర్వహించొద్దని నిర్ణయం తీసుకున్నట్లు ఏసీపీ ఎన్.రామారావు తెలిపారు.
పిడిగుద్దులాట...?
133 సంవత్సరాల నుంచి పిడిగుద్దులాట అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం హోలీ రోజు హున్సా గ్రామంలో రంగులు, కుస్తీల పోటీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామ చావిడి దగ్గర గ్రామస్థులంతా రెండువర్గాలుగా విడిపోయి ఒకరినొకరు పిడిగుద్దులతో కొట్టుకుంటారు. ఈ ఆట ఆడకుంటే అరిష్టం జరుగుతుందని.. అందుకే కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.
ఇదీ చదవండి: ఆర్డరివ్వండి... పోస్టులో ప్రసాదం మీ ఇంటికొస్తుంది..