కరోనా ఆపత్కాలంలో అందరి కంటే ముందుండి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విలేకరులకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ నాయకులు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఓ వైపు మహమ్మారి విజృంభిస్తున్నా.. ధైర్యం చేసి ప్రజలకు కరోనాపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తోన్న జర్నలిస్టులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అభినందించారు.
ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు, ఇంఛార్జ్ తాహెర్బిన్ హందాన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు.
- ఇవీ చూడండి: కృష్ణా బేసిన్లో నిండు కుండల్లా జలాశయాలు