ETV Bharat / state

సమీకృత కలెక్టరేట్​ను సందర్శించిన జిల్లా పాలనాధికారి - సమీకృత కలెక్టరేట్​ను సందర్శించిన జిల్లా పాలనాధికారి

నిజామాబాద్​లోని సమీకృత కలెక్టరేట్​ కాంప్లెక్స్​ను జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి సందర్శించారు. దసరా పండుగ వరకు కలెక్టరేట్​ను ప్రారంభించే విధంగా పనులు చేస్తున్నామన్నారు.

nizamabad collector visited new collectorate building
సమీకృత కలెక్టరేట్​ను సందర్శించిన జిల్లా పాలనాధికారి
author img

By

Published : Sep 17, 2020, 6:29 PM IST

నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డు దుబ్బలోని సమీకృత కలెక్టరేట్​ కాంప్లెక్స్​ను జిల్లా కలెక్టర్​ సి.నారాయణరెడ్డి సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్​లో కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్​ను దసరాకు ప్రారంభించుకునే విధంగా పనులు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టరేట్​కు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎవరైనా జిల్లా కేంద్రానికి పనిమీద వస్తే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్​లో జిల్లాకు సంబంధించిన అందరు అధికారులను కలుసుకొనేందుకు వీలుగా ఈ కలెక్టరేట్ ఉంటుందన్నారు. వచ్చిన ప్రజలకు కూర్చోవడానికి బల్లలు, తాగడానికి నీళ్లు, టాయిలెట్స్​ అన్నీ ఉండే విధంగా, ప్రజలకు అనుకూలంగా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్నందున ప్రజలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'డబుల్​ బెడ్​ రూం లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.