హరితహారంలో భాగంగా జిల్లాలోని ప్రతి రోడ్డుకు ఇరువైపులా ఐదు మీటర్లకు ఒకటి చొప్పున మొక్కను నాటాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొక్కలను రక్షించేందుకు వనసేవకులను నియమించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి సూచనను పాటిస్తూ జిల్లా అభివృద్ధికై కృషి చేయాలని ఆదేశించారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. గ్రామ వనసేవకులకు ఎప్పటికప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాన్ని ఇవ్వాలన్నారు. నాటిన ప్రతి మొక్కను బ్రతికించినప్పుడే చెల్లింపు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వచ్చే సోమవారం మళ్లీ సమీక్షిస్తామన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించే విధంగా కృషి చేయాలని... నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి: కొవిడ్ కట్టడిపై ఉన్నతస్థాయి సమీక్ష చేయండి: సీపీఐ