నిజామాబాద్ జిల్లాలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ పేరిట మోసానికి పాల్పడ్డ ఘటనపై కలెక్టర్ నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇంజక్షన్లను బ్లాక్లో విక్రయించడానికి యత్నించిన ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. యంత్రాంగం ఘటనలను తీవ్రంగా పరిగణిస్తోందంటూ.. ఆయా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి.. పలువురు మీడియా ప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు కలెక్టర్. వారి సర్టిఫికెట్లను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారు మళ్లీ వృత్తిలో కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మీడియా, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు.. ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ పేరిట మోసం... వైద్యుడు, కాంపౌండర్ అరెస్టు