ETV Bharat / state

'పెండింగులో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలి'

నిజామాబాద్​ కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో పాలానాధికారి సి. నారాయణరెడ్డి సమీక్షాసమావేశం నిర్వహించారు. లాక్​డౌన్​ కాలంలో పెండింగ్​ పడిన పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సీజనల్​ వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

nizamabad collector on pending works
'పెండింగులో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలి'
author img

By

Published : May 28, 2020, 6:21 PM IST

లాక్​డౌన్ కాలంలో పెండింగులో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలం ప్రవేశిస్తున్నందున జిల్లాలో ఎటువంటి సీజనల్ వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొవిడ్-19 నేపథ్యంలో ఇతర వ్యాధులు ప్రబలి జనాలు ఇబ్బంది పడకుండా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తిచేయాలని, హరితహారంలో భాగంగా గతంలో నాటిన మొక్కలను కాపాడుకోవాలన్నారు. రాబోయే వానాకాలంలో యథావిధిగా హరితహారం కొరకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్​ తెలిపారు.

ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.