ETV Bharat / state

నా పేరుతో డబ్బులు అడిగితే ఇవ్వొద్దు: కలెక్టర్​ నారాయణరెడ్డి - ఫేస్​బుక్​ సైబర్​ నేరాలు

నిజామాబాద్​ కలెక్టర్​​ పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతా పట్ల ఆ జిల్లా​ కలెక్టర్​ నారాయణరెడ్డి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని ప్రజలకు సూచించారు.

nizamabad collector narayanreddy clarifies on fake fb id
నా పేరుతో డబ్బులు అడిగితే ఇవ్వొద్దు: కలెక్టర్​ నారాయణరెడ్డి
author img

By

Published : Nov 5, 2020, 1:46 PM IST

నిజామాబాద్​ కలెక్టర్​ నారాయణ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతాపై కలెక్టర్​ స్పష్టతనిచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను తన అసలు ఫేస్​బుక్​ ఖాతా ద్వారా పంచుకున్నారు.

నకిలీ ఖాతా ద్వారా కలెక్టర్ ఫేస్​బుక్ ఖాతాతో​ చాటింగ్ చేస్తూ తమ బంధువులకు సీరియస్​గా ఉందని, ఐసీయూలో ఉన్నారని సైబర్ నేరస్థులు అందులో పేర్కొన్నారు. డబ్బులు కావాలని మళ్లీ తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మబలికారు.

ఈ విషయం కలెక్టర్​కి తెలియడంతో ఆయన తన అసలు ఖాతాలో ప్రజలను అప్రమత్తం చేసేలా పోస్టు పెట్టారు. తన పేరుతో నకిలీ అకౌంట్ సృష్టించారని.. ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్​ వెల్లడించారు.

నకిలీ ఖాతాతో కలెక్టర్​ బంధువుకి సందేశాలు

ఇదీ చదవండి: నిజామాబాద్​ కలెక్టర్​ పేరిట నకిలీ ఫేస్​బుక్ ఖాతా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.