నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ (lockdown) అమలుతో.. 30 శాతానికి పైగా ఉన్న కొవిడ్ కేసులు (Covid cases decreased) 6 శాతానికి చేరుకున్నాయని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఫీవర్ సర్వే (fever survey) ద్వారా మంచి ఫలితం కనిపిస్తోందన్నారు. లక్షణాలున్న (covid symptoms) వారిని గుర్తించి.. మందులు అందించడం వల్ల కేసులు గణనీయంగా తగ్గాయని వివరించారు.
మినహాయింపు సమయంలో.. ప్రజలు గుమిగూడకుండా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6 వేల మంది సుపర్ స్ప్రెడర్లకు(super spiders) వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రజల సహకరిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!