ETV Bharat / state

MP Arvind Counter To Kavitha: ఐదేళ్లు ఎంపీగా ఆమె చేసింది శూన్యం: అర్వింద్ - భాజపా నిజామాబాద్ ఎంపీ కవిత

MP Arvind Counter To Kavitha: ఎంపీగా ఉన్న ఆమె ఐదేళ్లలో పసుపు రైతులకు చేసింది శూన్యమని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. పసుపు బోర్డుపై ఎమ్మెల్సీ కవిత మాటలకు కౌంటర్ ఇచ్చారు. రైతుల కోసం ఆమె ఎంపీగా ఉన్నప్పుడు చేసిన పనులను ఆయన వివరించారు.

MP Arvind Counter To Kavitha
భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్
author img

By

Published : May 4, 2022, 8:59 PM IST

Updated : May 4, 2022, 9:28 PM IST

MP Arvind Counter To Kavitha: ముఖ్యమంత్రి బిడ్డగా ఐదేళ్లలో రైతులకు చేసింది శూన్యమని నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తాను ఎంపీ అయినా మూడేళ్లలోనే తీసుకొచ్చిన నిధులను ఒక్కసారి చూడాలని హితవు పలికారు. రైతుల సమస్యలు ఉన్నందునే తాను సమాధానం చెబుతున్నాని తెలిపారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప భాజపా నేతలు చేసిందేమీ లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్​లో ధ్వజమెత్తారు. ఆమె మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని.. రైతుల సమస్య అయినందు వల్లే సమాధానం చెబుతున్నానని తెలిపారు.

ఆమె ఎంపీగా ఐదేళ్లలో పసుపు రైతులకు చేసింది శూన్యం. ఆమెకు గతంలోనే స్పైస్ బోర్డు జవాబిచ్చాక రెండు సార్లు బడ్జెట్ వచ్చింది. మళ్లీ ఒకసారి స్పైస్ బోర్డుకు లేఖ రాయండి. మీకు రిప్లై వస్తుంది. పసుపు రైతుల కోసం ముఖ్యమంత్రి బిడ్డ ఐదేళ్లలో 13 బాయిలర్లు, మూడు పాలిషర్లు, టార్పాలిన్లు సున్నా. తెచ్చింది. మేం మూడేళ్లలో 108 బాయిలర్లు, 209 పాలిషర్లు, టార్పాలిన్లు 7240 తీసుకొచ్చాం.

- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

పసుపు రైతులు జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్​లో లేరా అని ప్రశ్నించారు. ఆమె గతేడాది అడిగిన ప్రశ్నలకు స్పైస్ బోర్డు జవాబిచ్చాక రెండుసార్లు బడ్జెట్ వచ్చిందని పేర్కొన్నారు. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు పసుపు రైతుల కోసం ఐదేళ్లలో 13 బాయిలర్లు, మూడు పాలిషర్లు మాత్రమే తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. నేను ఎంపీ అయ్యాక మూడేళ్లలో 108 బాయిలర్లు, 209 పాలిషర్లు, టార్పాలిన్లు 7240 తీసుకొచ్చానని వెల్లడించారు.

ఇవీ చూడండి: 'మోకాళ్ల యాత్రే చేస్తారో.. మోకరిల్లుతారో.. బోర్డు మాత్రం పట్టుకురండి..'

Last Updated : May 4, 2022, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.