నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వన్నెల్(బి), మెండోరా మండలం బుస్సాపూర్‌లో అదనపు కలెక్టర్ లత శనివారం పర్యటించారు. కొవిడ్ నేపథ్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. అనంతరం బాల్కొండలోని ప్రభుత్వాస్పత్రిని సందర్శించి కరోనా నిర్ధరణ పరీక్షలు, వ్యాక్సినేషన్ తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కొవిడ్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ మందులు అందజేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. బాధితులు త్వరగా కోలుకునే విధంగా తరచుగా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేవరయాంజాల్‌లో తాత్కాలికంగా నిలిచిన భూ సర్వే