నిజామాబాద్ జిల్లాలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిపారు. స్వామి రథాన్ని లాగుతూ ఊరేగింపు నిర్వహించారు. నీలకంఠేశ్వరస్వామి ఆలయం నుంచి సమీపంలోని మీసేవ కేంద్రం వరకు ఊరేగించి అనంతరం ఆలయానికి తీసుకొచ్చారు.
రథంలో ఉన్న దేవతామూర్తులను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్ రెడ్డి