నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి, వరద ముప్పుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుకున్నారు. ప్రతిఏటా ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగను.. కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడాది నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.
- ఇదీ చదవండి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు