నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూరులోని బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చాడు. కరోనా సమయంలో కోడలిని పుట్టింటికి పంపనని, తర్వాత వచ్చి తీసుకెళ్లాలని మామ చెప్పాడు. ఆగ్రహించిన అమ్మాయి తండ్రి రాజం.. వియ్యంకుడు రాములుపై కర్రతో దాడి చేశాడు. నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడు.
ఇవీ చూడండి: స్వస్థలాలకు వెళ్లే వారి కోసం డిజిటల్ పాసులు : డీజీపీ మహేందర్ రెడ్డి