నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా.. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.8,500 జీతం చెల్లించాలని... ఉదోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. లేనిపక్షంలో రిలే నిరాహారదీక్షలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః 'ఇప్పుడు మనం జలసంక్షోభ స్థితిలో ఉన్నాం'