నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హజరైన ఎంపీ అర్వింద్... అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పిప్రీ శివారులోని పంటలను పరిశీలించిన ఎంపీ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై అర్వింద్ విరుచుకుపడ్డారు.
వరి, సోయా పంటలను వేయమన్న ముఖ్యమంత్రి ఇప్పుడు.. ఆ దిగుబడులను కొనుగోలు చేయడానికి కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. తాగిన మైకంలో సీఎం కేసీఆర్ ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతుల పట్ల కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. పౌల్ట్రీఫామ్ యజమానులకు ముఖ్యమంత్రి అమ్ముడు పోయాడని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు.