MLC Kavitha On Telangana Jobs 2023 : రాష్ట్రంలో నిరుద్యోగ కాంగ్రెస్ నేతల సమావేశాలు మాత్రమే జరిగాయని.. వారి మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఉందన్న కాంగ్రెస్, బీజేపీలు.. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
MLC Kavitha Comments BJP and Congress : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఐదేళ్లలో కేవలం 21 ఉద్యోగాలు(Telangana Jobs Notification 2023) మాత్రమే ఇచ్చాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదే తెలంగాణలో పదేళ్లలో 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. అదే ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. మళ్లీ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు.
కవితను ఓడించారని నిజామాబాద్ జిల్లా ప్రజలపై కేసీఆర్ పగబట్టారు: రేవంత్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఇళ్లకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశంలో ఆనకట్టలను నిర్మించి జవహర్లాల్ నెహ్రూ వాటిని ఆధునిక దేవాలయాలు అని అన్నారని గుర్తు చేశారు. కానీ ఎందుకు తెలంగాణలో ప్రాజెక్టులు(Telangana Projects) కట్టడానికి కాంగ్రెస్ నేతలకు మనసు ఒప్పుకోలేదని విమర్శించారు. గతంలో వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉండేదని.. కానీ ఇప్పుడు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరైడ్ సమస్య(Fluoride) లేదని చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని అందిస్తున్నామని అన్నారు.
"కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా కూడా కొత్తగా బాండ్ పేపర్లు రాసిస్తామని కొత్త డ్రామాకు తెరతీశారు. 137 చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 ఏళ్లు రాజకీయ జీవితం గల సీనియర్ నాయకులు జగిత్యాల జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు ఈరోజు బాండ్ పేపర్లు రాసి ఇస్తున్నారు. కాంగ్రెస్‌పై ప్రజలు ఎంత విశ్వాసం కోల్పోయారో చెప్పడానికి ఇదే నిదర్శనం. అన్ని గ్యారెంటీలు, సంతకాలు చేసిన వీళ్లు ఒక్క కార్యక్రమం కూడా మొదలు పెట్టలేకపోయారు. ఈరోజు దేశంలోనే తెలంగాణ అత్యధిక ఉద్యోగాలు భర్తీ చేసింది. కాంగ్రెస్, బీజేపీ పాలించిన రాజస్థాన్‌లో కేవలం 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు." - కవిత, ఎమ్మెల్సీ
రేషన్‌కార్డు సమస్యను పరిష్కరిస్తాం : సీఎం కేసీఆర్ ఉన్న రెండు పర్యాలయాల్లో తెలంగాణను ఎంతో అభివృద్ది చేశామని.. ఇప్పుడు మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని కవిత హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ముందుకు దూసుకుపోతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో గెలిచిన వెంటనే రేషన్‌కార్డుల సమస్యను పరిష్కరించి అందరికీ రూ.5 లక్షల బీమా(Bheema) సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చారు. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పాలసీ ప్రకటిస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన మహిళలందరికి పింఛన్లు : కవిత