నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నగర సుందరీకరణ కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక పనులు చేపట్టినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించారు.
నిర్మాణ వివరాలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ పక్కనే నిర్మిస్తున్న ఐటీ హబ్‌ను పరిశీలించారు. ఆ తర్వాత భూగర్భ మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ను సందర్శించి సమీక్షించారు. అనంతరం రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించి చెరువు కట్టపై ఉన్న మహా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
-
Inaugurated a breast feeding kiosk at Nizamabad railway station, a wonderful initiative by Rotary Club of Nizamabad. Congratulating the members of Rotary club, Nizamabad for taking a step towards making our society more sensitive towards women & children.#breastfeeding pic.twitter.com/4qK5KeHiOo
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Inaugurated a breast feeding kiosk at Nizamabad railway station, a wonderful initiative by Rotary Club of Nizamabad. Congratulating the members of Rotary club, Nizamabad for taking a step towards making our society more sensitive towards women & children.#breastfeeding pic.twitter.com/4qK5KeHiOo
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 2, 2021Inaugurated a breast feeding kiosk at Nizamabad railway station, a wonderful initiative by Rotary Club of Nizamabad. Congratulating the members of Rotary club, Nizamabad for taking a step towards making our society more sensitive towards women & children.#breastfeeding pic.twitter.com/4qK5KeHiOo
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 2, 2021
పరిపాలన సౌలభ్యం కోసం ఆధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని కవిత చెప్పారు. నిజామాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని కవిత తెలిపారు.
ఇదీ చదవండి: శేషాద్రి కుటుంబానికి మంత్రి ఈటల పరామర్శ