ETV Bharat / state

MLC Kavitha Fires on Rahul Gandhi : 'రాహుల్ ఇక్కడికి వచ్చి మీరు చేసేదేం లేదు.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి'

MLC Kavitha Fires on Rahul Gandhi in Nizamabad : తెలంగాణ ప్రజలంతా బాగానే ఉన్నారని.. ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని మళ్లీ చెడగొట్టవద్దని కాంగ్రెస్​ నేతలకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కవిత ఆయన పర్యటనపై స్పందించారు. విభజన చట్టంలోని తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి రాహుల్​ ఎప్పుడైనా ప్రశ్నించారా అంటూ నిలదీశారు.

MLC Kavitha Fires on Rahul Gandhi
MLC Kavitha Fires on Rahul Gandhi in Nizamabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 12:06 PM IST

Updated : Oct 18, 2023, 12:21 PM IST

MLC Kavitha Fires on Rahul Gandhi రాహుల్ మీరు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి

MLC Kavitha Fires on Rahul Gandhi in Nizamabad : విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి రాహుల్​ గాంధీ ఎప్పుడైనా ప్రశ్నించారా అంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అందుకే రాహుల్​ జీ మీరు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు.. అంకాపూర్​ చికెన్​ తినేసి వెళ్లండని వ్యంగ్యంగా చురకలు అంటించారు. నిజామాబాద్​లోని బోధన్​ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ నేతల(MLC Kavitha Election Campaign)తో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని.. రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేశారు.

MLC Kavitha Rahul Gandhi Nizamabad Tour : నిజామాబాద్​ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కవిత తెలిపారు. కాంగ్రెస్​ అగ్రనేతలు వచ్చి తమకు ఏమీ చెప్పనక్కరలేదని వ్యాఖ్యానించారు. బీసీల అభివృద్ధికి బీఆర్​ఎస్​ ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. రాహుల్​ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. వేల మంది బీసీ యువకులు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం.. సీఎం కేసీఆర్​ కల్పించారని తెలిపారు.

MLC Kavitha on Rahul Gandhi Comments : సత్య దూరమైన మాటలు చెప్పడం రాహుల్‌ గాంధీకి అలవాటే: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha on Rythu Bandhu Scheme : రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. రైతులపై రాజకీయం చేయడం కాంగ్రెస్​ నేతల నైజమని ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ పరిపాలనలో హైదరాబాద్​కు వందల కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. గత చరిత్రను చూసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా సీఎంను మార్చాలని చూపినప్పుడల్లా మత కల్లోలాలు రేపింది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతగా అభివృద్ధి జరిగిందా అని రాహుల్​ గాంధీని కవిత ప్రశ్నించారు.

"రైతులను కాపాడుకునే నైజం సీఎం కేసీఆర్​ది. రైతులతో రాజకీయం చేసే నైజం రాహుల్​ గాంధీది. రాజకీయం కోసం రెండు మాటలను చెప్పే నాయకులను నమ్ముతారో.. ఎలక్షన్​ ఉన్నా లేకున్నా మీతో పాటు నిలబడే వాళ్లను నమ్ముతారో ప్రజలే తేల్చుకోవాలి. అన్ని మతాలు కలిసి తెలంగాణలో చాలా శాంతియుతంగా ఉంటున్నాం. హైదరాబాద్​లో ఈరోజు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి." - కవిత, ఎమ్మెల్సీ

MLC Kavitha Election Campaign at Boathan : 65 ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్​ చేసిందేమిటో రాహుల్​గాంధీ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల గురించి కాంగ్రెస్​ ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. తెలంగాణ ప్రజలంతా బాగానే ఉన్నారని.. మంచి వాతావరణం మళ్లీ చెడగొట్టకండని హితవు పలికారు. నిజామాబాద్​లో అంకాపూర్​ చికెన్​ రుచి చూడాలని రాహుల్​ను కవిత కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాహుల్​ గాంధీకి తెలంగాణ గుర్తుకు వస్తుందా అంటూ కవిత ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బోధన్​ ఎమ్మెల్యే షకీల్​, బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MLC Kavitha Bathukamma Song : 'అవనిపై గౌరీదేవి బతుకమ్మై వెలసిందో ఓ సందామావయ్యా'.. ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా..?

MLC Kavitha Fires on BJP and Congress : 'బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీవి దిగజారుడు మాటలు'

Last Updated : Oct 18, 2023, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.