ETV Bharat / state

అక్కడకు వెళ్లడానికి వీల్లేదు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు - బాబాపూర్​లో గవర్నమెంట్ టీచర్ సూసైడ్

MLC Jeevan Reddy Arrest : నిజామాబాద్ జిల్లా బాబాపూర్​లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఆత్మహత్య దృష్ట్యా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బాల్కొండలో పలువురు భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు నిజామాబాద్ వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కమ్మర్​పల్లి వద్ద అరెస్టు చేశారు.

MLC Jeevan Reddy Arrest
MLC Jeevan Reddy Arrest
author img

By

Published : Jan 10, 2022, 12:17 PM IST

బాబాపూర్​ వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్టు..

MLC Jeevan Reddy Arrest : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో ఉద్రిక్త వాతావణం నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి ఇంటి వద్దకు భారీగా జనం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పరామర్శకు వచ్చిన కాంగ్రెస్‌ నేత అనిల్‌ను అరెస్టు చేశారు. మృతురాలి ఇంటివద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

బాల్కొండలో ముందస్తు అరెస్టులు..

BJP Leaders Arrest in Balkonda : బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలి ఆత్మహత్య దృష్ట్యా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బాల్కొండ భాజపా ఇంఛార్జ్ మల్లికార్డునరెడ్డిని అరెస్టు చేసి ఆర్మూర్ పీఎస్​కు తరలించారు. సరస్వతి కుటుంబాన్ని ఎంపీ అర్వింద్ ఇవాళ పరామర్శించనున్నారు.

జీవన్ రెడ్డి అరెస్టు..

Congress Leaders Arrest : నిజామాబాద్​ జిల్లా బాబాపూర్​లో ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా.. కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమ్మర్​పల్లి వద్ద ఆయణ్ని అరెస్టు చేశారు. '317 జీవో ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయురాలు సరస్వతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం పరామర్శించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని' తన అరెస్ట్‌పై జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

Revanth on Jeevan Reddy Arrest : మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అరెస్టును టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఖండించారు. విపక్ష నేతల అరెస్టును ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం నేరమా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో కేసీఆర్ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.

అసలేం జరిగిందంటే..

Government Teacher Suicide in Babapur : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం బాబాపూర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు(ఎస్జీటీ) బేతాల సరస్వతి (34) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. దశాబ్ద కాలం పాటు ఆమె సొంత మండలంలోనే ఉద్యోగం చేశారు. మొన్నటి వరకు భీమ్‌గల్‌ మండలం రహత్‌నగర్‌లో విధులు నిర్వహించేవారు. నూతన జీవో ప్రకారం కేటాయింపుల్లో భాగంగా ఆమె కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు.

అక్కడికి వెళ్లలేక.. ఇక్కడ ఉండలేక

Teacher Suicide in Babapur : బతుకుదెరువు కోసం ఖతార్‌ వెళ్లిన భర్త భూమేష్‌కు ఈ విషయం తెలియజేయగా.. ఇబ్బందులు పడుతూ ఉద్యోగం చేయడం ఎందుకని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లలేక.. సొంత ఊరిలో ఉండలేక ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ ఈ నెల 7న కొత్త పాఠశాలకు వెళ్లి విధుల్లో చేరారు. అక్కడ ఆమె ఒక్కరే ఉపాధ్యాయురాలు. ఆదివారం ఇంట్లో ఇద్దరు కుమారుల(కవలలు)కు అన్నం పెట్టి ఇప్పుడే వస్తానని బంగ్లాపైకి వెళ్లి దూలానికి తాడుతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సరస్వతి సొంతూరు నుంచి ప్రస్తుతం పోస్టింగ్‌ పొందిన మర్లకుంట తండా 110 కి.మీ. దూరం. ఆమె సోదరుడు లోకేశ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనాథ్‌ తెలిపారు.

Teacher Suicide in Nizamabad : ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతీ భర్త భూమేశ్ ఖతార్ నుంచి సొంతూరు బాబాపూర్ చేరుకున్నారు. కాసేపట్లో జరిగే ఆమె అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి : Govt Teacher Died: గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి.. బదిలీ ఆందోళనతోనేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.