నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాను సీఎం కేసీఆర్ పరామర్శించారు. రోడ్డు మార్గం ద్వారా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో చేరుకున్నారు. గణేశ్ గుప్త తండ్రి కృష్ణమూర్తి గుప్తా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బిగాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తాను ఓదార్చారు. భోజనం అనంతరం రోడ్డు మార్గంలో ప్రగతి భవన్‌కు బయల్దేరి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి వచ్చారు. సీఎం కేసీఆర్ వెళ్లిన కొద్దిసేపటికే మంత్రి హరీశ్‌రావు... గణేశ్ గుప్తాను పరామర్శించారు.
అంతకుముందు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సురేందర్, హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ మార గంగా రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు ఎమ్మెల్యే గణేష్ గుప్తాను పరామర్శించారు.
ఇదీ చూడండి: 'వాళ్లు రిగ్గింగ్ చేసినా... గెలిచేది మాత్రం మేమే'