ETV Bharat / state

రోడ్డుపై మిషన్ భగీరథ ఫౌంటెయిన్ - NIZAMABAD DISTRICT LATEST NEWS

నిజామాబాద్ జిల్లా చాంద్రాయన్​పల్లి సమీపంలో మిషన్​ భగీరథ పైపులైన్​ లీకైంది. పెద్దఎత్తున నీరు ఎగిసిపడటంతో తాగునీరంతా వృథాగా పోయింది.

భగీరథ పైప్​లైన్ లీక్​
భగీరథ పైప్​లైన్ లీక్​
author img

By

Published : Jun 3, 2021, 7:27 AM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి మండలం చాంద్రాయన్​పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై మిషన్​ భగీరథ పైప్​లైన్​ బుధవారం లీకైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న పైప్​లైన్ లీకేజీతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది.

పైపుల నిర్మాణంలో నిర్లక్ష్యంతోనే తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంటలు చేతికందే సమయంలో ఇలాంటి లీకేజీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. లీకేజీలను పకడ్బందీగా అరికట్టాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: Krishna Water: 'కృష్ణా బేసిన్​లో నీరు వినియోగించుకునేలా మార్పు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.