తమకు వెంటనే వేతనాలు చెల్లించాలంటూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్‌పూర్‌లోని మిషన్ భగీరథ పంపుహౌజ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జలాల్‌పూర్ నుంచి గోదావరి జలాలు నిజామాబాద్ జిల్లాతో పాటు, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పలు గ్రామాలకు ఈ పంపుహౌజ్ ద్వారా నీళ్లు అందుతాయి.
భగీరథ పంప్‌హౌజ్‌తో పాటు ఇతర పంప్‌హౌజ్‌లలోని ఆపరేటర్లు, సూపర్‌వైజర్లు అంతా కలిపి 60 మంది వరకు ఎవరెస్ట్ ఇన్‌ఫ్రా కంపెనీలో పని చేస్తున్నారు. వీరికి గత ఏడు నెలలుగా కంపెనీ వేతనాలు చెల్లించడం లేదని, ఇల్లు ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. వెంటనే ఏడు నెలల వేతనాలు చెల్లించాలని ప్రశ్నిస్తూ మొదటి పాయింట్ అయిన జలాల్‌పూర్ పంప్‌హౌజ్ వద్ద మోటర్లను నిలిపి వేసి నిరసన తెలిపారు. మోటార్లు నిలిపివేయడం వల్ల మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ఈ విషయమై కార్మికులు అధికారులను సంప్రదించగా సమస్య పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి : కరోనాతో నర్సుల యుద్ధం..మృత్యువుతోనే పోరాటం..