ETV Bharat / state

Pallikonda lift: ఖరీఫ్​లో నీటిని తోడెేందుకు ప్రాజెక్టు పూర్తి - పల్లికొండ ఎత్తిపోతల పనుల వార్తలు

నిజామాబాద్​ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం చేపట్టిన పల్లికొండ(pallikonda lift) లిఫ్ట్​ ఇరిగేషన్​ పనులను మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పరిశీలించారు. వర్షాకాలంలో చెరువులకు నీటిని ఎత్తిపోసేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్​ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

minister vemula prashanth reddy on pallikonda lift
పల్లికొండ లిఫ్ట్​ ఇరిగేషన్​పై మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పర్యవేక్షణ
author img

By

Published : May 28, 2021, 1:19 PM IST

వర్షాకాలంలో నీటిని తోడేందుకు పల్లికొండ లిఫ్ట్ పూర్తైందని, పైప్​లైన్ చిన్న చిన్న మరమ్మతులు వారం రోజుల్లో పూర్తవుతాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి(minister prashanth reddy) అన్నారు. ఈ లిఫ్ట్ ద్వారా సుమారు 7 గ్రామాలకు సాగునీటిని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నిజాంసాగర్ పాత కాల్వ ద్వారా జానకంపేట మల్లాడి చెరువు నింపే ఫీడర్ ఛానల్​ను మంత్రి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో గురువారం ఆయన పర్యటించారు.

క్షేత్ర స్థాయిలో పరిశీలన

పైప్​లైన్ వేయాల్సిన ఫీడర్ చానల్ స్థలాన్ని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిధుల మంజూరుకు కృషి చేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అనంతరం పల్లికొండ ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్ట్​, మోటర్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వర్షాకాలంలో నీటిని తోడేందుకు సిద్ధంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

బైక్​పై తిరుగుతూ...

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు లిఫ్ట్​ల ద్వారా చెరువులను నింపుకోవాలనే ఆలోచనతో నియోజకవర్గంలోని వేముగంటి, పల్లికొండ ఎత్తిపోతల మోటార్లని పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. పల్లికొండ ఎత్తిపోతల పథకం ద్వారా దిగువన ఉన్న సుమారు 7 గ్రామాల చెరువులు నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. అనంతరం పల్లికొండ, బాచన్ పల్లి, ముచ్కూర్ చెరువులు పరిశీలించారు. చెరువు కట్టలపై బైక్​పై కలియతిరుగుతూ చెరువుల నాణ్యత, నీటిని నింపుకునేందుకు వీలుపడే ఫీడర్ ఛానళ్లను పరిశీలించారు.

అనంతరం మార్గమధ్యలో ఫీవర్​ సర్వే చేస్తున్న ఆశావర్కర్లు, ఏఎన్​ఎంలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో కరోనా సోకిన వారి వివరాలపై ఆరా తీశారు. లాక్​డౌన్​ పక్కాగా అమలయ్యేలా సర్పంచ్​లు, వార్డు మెంబర్లు చూడాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: Covid Query: ఫోన్‌కాల్‌ దూరంలో... వైద్య సలహాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.