న్యాక్ లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులో రూ. 6.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జిల్లా నైపుణ్య కేంద్రానికి ఆయన భూమి పూజ నిర్వహించారు.
ఎంతో మేలు జరుగుతుంది
ఏ పనిలోనైనా నైపుణ్యం ఉంటే వారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని.. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి భవన నిర్మాణ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు న్యాక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. జిల్లా యువతకు ఈ కేంద్రాల ద్వారా ఎంతో మేలు జరుగుతుందని తెలిపిన మంత్రి.. గల్ఫ్ వెళ్తున్న కార్మికులకు ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ , తాపీ మేస్త్రీ వంటి పనులలో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, కలెక్టర్ నారాయణరెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అచ్చు పులిలా ఉంది.. ఊరిని భయపెట్టిన గ్రామసింహం..!