నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకడ గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రకృతివనాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. అందుకోసమే స్వచ్ఛత కార్యక్రమాలతో గ్రామాలను సీఎం.. అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన చేయలేదని చెప్పారు.
జిల్లాలో దాదాపు 618 పల్లె ప్రకృతి వనాలు మంజూరయితే అందులో ఇప్పటికే 559 పూర్తయ్యాయని వేముల తెలిపారు. అనంతరం పచ్చల నడుకుడ, భీంగల్‌లో పెద్దమ్మ, హనుమాన్ మందిరాల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి'