నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కరోనా వ్యాప్తి, ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరాపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జబ్బు చేసినవారిని గుర్తించి బయటకి రాకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. బీపీ, షుగర్ ఉన్న వారికి మందులకు ఇబ్బంది కాకుండా వైద్యాధికారులు ,ఆశా వర్కర్లు గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 61 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 5 గురు మాత్రమే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరని తెలిపారు. ముంబయి, పుణే, నాగపూర్ నుంచి వచ్చే వారిని గుర్తించి హోం క్వారంటైన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
లాక్డౌన్ కఠినంగా చేయగలిగితేనే నిజామాబాద్ జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరిధాన్యం కొనుగోలు ఇప్పటివరకు 67 శాతం పూర్తయిందని.. మిగతా 33 శాతం తొందరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జీరో స్టాక్ ఉన్న సొసైటీలకు 5 రోజుల్లో ఎరువులను పంపాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: తెరాస ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ