ETV Bharat / state

నిజామాబాద్​ నుంచి 53 మంది దిల్లీకి వెళ్లారు: మంత్రి ప్రశాంత్​రెడ్డి - కరోనా పరీక్షలు

హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్​కు వెళ్లిన వారిలో నిజామాబాద్ ​నుంచి 53 మంది ఉన్నారని ఉన్నారని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని.. వారిలో 14 మందికి రిపోర్టులు రావాల్సి ఉండగా.. ఒకరికి మాత్రమే పాజిట్​వ్​ వచ్చిందని ఆయన వెల్లడించారు.

minister prashanth reddy press meet on corona patients at nizamabad
నిజామాబాద్​ నుంచి 53 మంది దిల్లీకి వెళ్లారు: మంత్రి ప్రశాంత్​రెడ్డి
author img

By

Published : Apr 1, 2020, 5:05 AM IST

దిల్లీకి వెళ్లిన వారిలో నిజామాబాద్ జిల్లా నుంచి 53 మంది ఉన్నారని.. కాగా వారిలో 43 మంది పట్టణ వాసులే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నలుగురిని అనుమానితులుగా గుర్తించి హైదరాబాద్​కు తరలించామని.. వారి రిపోర్ట్​లు ఇంకా రాలేదని మంత్రి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్​లో కరోనాపై చేపడుతున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అధికారులతో ఆయన సమీక్షించారు.

జిల్లా నుంచి వ్యాధి లక్షణాలున్నాయనే అనుమానంతో 29 మందిని హైదరాబాద్​కు పంపామని.. 14 మంది రిపోర్టు రావాల్సి ఉండగా.. మిగతా అందరికీ నెగటివ్ వచ్చిందన్నారు. ఒకరికి మాత్రమే పాజిటివ్ కేసు నమోదైందని చెప్పారు. జిల్లాలో 11వేల మంది వలస కార్మికులు ఉండగా.. వారికి బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నామని రెండు రోజుల్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు.

నిజామాబాద్​ నుంచి 53 మంది దిల్లీకి వెళ్లారు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

ఇదీ చూడండి: ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.