ఉద్యోగుల పీఆర్సీ గురించి మాట్లాడుతున్న భాజపా అధ్యక్షుడు బండి సంజయ్... సీపీఎస్ రద్దుపై ఎందుకు మాట్లాడటం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం సరికాదని మంత్రి హితవు పలికారు. నిజామాబాద్లో టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ పనితీరు మెచ్చుకున్న ఉద్యోగులపై బండి సంజయ్ విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పీఆర్సీ గురించి మాట్లాడుతున్న బండ్ సంజయ్.. సీపీఎస్ రద్దుపై ఎందుకు నోరు మెదపడంలేదన్నారు.
ఇదీ చూడండి: డబిర్‌పురలో ఉద్రిక్తత... ఎంఐఎం, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం