నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దసరా నాటికి పనులు పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు నియోజకవర్గంలోని తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కొవిడ్ సేవలపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష