నిజామాబాద్ జిల్లా భీంగల్లో మెఫ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలో పండిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో 444 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రైతుకు ధాన్యం డబ్బులు మూడు నాలుగు రోజుల్లోనే రైతు ఖాతాల్లో పడే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
రైతులు నిబంధనల ప్రకారం తేమ లేకుండా జాలి పట్టి తీసుకురావాలని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా రెండు నిబంధనలు పెట్టిందని... అలా ఉండేలా రైతులు చూసుకోవాలని సూచించారు. అలా వచ్చిన ధాన్యన్ని రైస్ మిల్లర్లు కోత పెడితే మాత్రం ఊరుకునేది లేదని... అలాంటి మిల్లులపై సీజ్ చేస్తామని హెచ్చరించారు.