కశ్మీర్‌లో ఉగ్రవాదులను అడ్డుకొని వీరమరణం పొందిన రాడ్యా మహేశ్‌కు మంత్రి కేటీఆర్ ఘననివాళులు అర్పించారు. ఆయన త్యాగం మరువలేనిదని అన్నారు. అమరుడైన మహేశ్ మృతి పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహేశ్ త్యాగం మరువలేనిదని... ఆయన కుటుంబానికి యావత్ తెలంగాణ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టి దేశ సేవ కోసం వెళ్లిన మహేశ్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కోమన్‌పల్లిలో విషాదం అలుముకుంది. మహేశ్ మరణ వార్త తెలిసినప్పటి నుంచి ఆయన కుటుంబం, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఆర్మీలో చేరిన మహేశ్ రెండేళ్ల క్రితం ఆర్మీ నేపథ్యం ఉన్న యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇదీ చదవండి: కశ్మీర్‌లో ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం