ETV Bharat / state

ఉద్యోగులకు మంత్రి ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమం - కరోనా కట్టడి చర్యలు

తన నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ తన సొంత డబ్బుతో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని మంత్రి ప్రశాంత్​ రెడ్డి ఏర్పాటు చేశారు. కరోనాని నియంత్రించడానికి అహర్నిశలు కృషిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి మండలంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.

mid-day-meals-arranged-to-the-employees-by-the-minister-prashanth-reddy-in-nizamabad
ఉద్యోగులకు మంత్రి ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమం
author img

By

Published : Apr 5, 2020, 12:04 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కరోనా కట్టడికై రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులకు మంత్రి ప్రశాంత్​ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మండల కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని తెరాస శ్రేణులకు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని లాక్‌డౌన్‌ ముగిసే వరకు నిర్వహించనున్నట్లు తెరాస నేతలు తెలిపారు.

వైద్య, పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్‌ కార్యాలయాల ఉద్యోగులతో పాటు పంచాయతీ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. ఉద్యోగులందరూ ప్రజల శ్రేయస్సు కోరి తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కంటికి కనిపించని మహమ్మారితో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్నారని తెరాస నాయకులు కొనియాడారు.

ఉద్యోగులకు మంత్రి ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమం

ఇదీ చూడండి: ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.