నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ మొత్తం మెడికల్ వ్యర్థాలతో నిండిపోయింది. గత వారం రోజులుగా చెత్త, వాడి పారేసిన మెడికల్ వ్యర్థాలు తొలగించకపోవడం వల్ల ఆస్పత్రి ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతోంది. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది వినియోగించిన పీపీఈ కిట్లు, గ్లౌజులు, సెలైన్ బాటిల్స్, వాడి పడేసిన ఇంజెక్షన్లు, మెడికల్ వ్యర్థాలు, ఇతర దుస్తులు గత వారం నుంచి అలాగే వదిలేశారు. కాగా.. నిజామాబాద్ నగరంలోని ఆస్పత్రుల్లో మెడికల్ వ్యర్థాలను తీసుకెళ్లేందుకు ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇతర సాధారణ చెత్తను మాత్రం మున్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తున్నారు. అయితే గత వారంపైగా మెడికల్ వ్యర్థాలను ఆస్పత్రి నుంచి తొలగించకపోవడం వల్ల ఆస్పత్రి పరిసరరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆస్పత్రి వ్యర్థాలతో మరో కొత్త రోగం సోకక ముందే వాటిని తొలగించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్