నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 67 మంది సిబ్బంది భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వైద్య విధాన పరిషత్ విభాగానికి చెందిన సిబ్బంది ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించేవారు. వీరి డిప్యూటేషన్ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. నెల రోజులు గడుస్తున్నా కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి రెన్యువల్ ఉత్తర్వులు వస్తేనే జీజీహెచ్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మే నెల వేతనం రాదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. సిబ్బంది రెన్యువల్‌పై కలెక్టర్, డీఎంఈకి విన్నవించామని.. ఆస్పత్రి నుంచి సిబ్బంది వెళ్లిపోతే కరోనా చికిత్స కష్టమవుతుందని చెబుతున్నాయి. కీలక విభాగాల్లో ఈ సిబ్బంది పని చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: ఆనందయ్య మందు.. కోటయ్య మృతి