నిజామాబాద్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నగర మేయర్ నీతూ కిరణ్ పరిశీలించారు. 12, 29, 40వ వార్డులలో పర్యటించి ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత వ్యక్తిగత బాధ్యతగా భావించాలని స్థానికులకు సూచించారు. మంచి నీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీరు అందించాలని.. లీకేజీలు గుర్తించి వెంటనే బాగు చేయాలని మేయర్... మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
వర్షాకాలంలో నీటి నిల్వలేకుండా ముందస్తుగా కాలువల్లో పూడికతీత, మురుగునీటి కాల్వల శుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. దోమల నిర్మూలనకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేయలని డ్రైనేజీలలో ప్లాస్టిక్ కవర్లు వేయవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?